నోటీస్ లేకుండా తొలగించారు: ఇండియన్ నర్స్‌ల ఆందోళన
- March 02, 2017
వందలాదిమంది ఇండియన్ నర్స్‌లు, తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ కువైట్‌లోని ఇండియన్ ఎంబసీలో ఫిర్యాదు చేశారు. ఫర్వానియా హాస్పిటల్లో వీరంతా పనిచేస్తున్నారు. ఐదేళ్ళ క్రితం మూడేళ్ళ కాంట్రాక్ట్ నిమిత్తం వీరంతా ఓ కాంట్రాక్టింగ్ కంపెనీ ద్వారా నియమితులయ్యారు. రెండేళ్ళ క్రితం కంపెనీ, వీరి కాంట్రాక్ట్‌ని రెన్యువల్ చేసింది. అయితే కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసిందని పేర్కొంటూ మూడు రోజుల్లో దేశం విడిచివెళ్ళాల్సిందిగా ఆదేశాలు చేయడంతో నర్సులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. గతంలోలా మరోసారి తమకు రెన్యువల్ కోసం అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారిక కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసినా, నర్సులు ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. అయినప్పటికీ ఉన్నపళంగా ఉద్యోగాలు కోల్పోవడం వల్ల వాళ్ళంతా రోడ్డునపడ్డట్లయ్యింది. తమ పిల్లలు కువైట్‌లోని పలు స్కూళ్ళలో పరీక్షలు రాస్తున్నారనీ, ఈ సమయంలో మూడు రోజుల్లోనే కువైట్ విడిచి వెళ్ళాలనడం అన్యాయమని నర్స్‌లు ఆవేదన చెందుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







