అమెరికాలో భారత అథ్లెట్ అరెస్టు రేప్ కేసులో
- March 02, 2017
న్యూయార్క్
అమెరికాలో పోటీలలో పాల్గొనేందుకు వెళ్లి, అక్కడ 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నేరంలో భారతీయ అథ్లెట్ తన్వీర్ హుస్సేన్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని స్నో షూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అమెరికా మీడియా తెలిపాయి. కశ్మీర్‌కు చెందిన తన్వీర్‌ను న్యూయార్క్ రాష్ట్రంలోని సారనాక్ లేక్ విలేజ్‌లో అరెస్టు చేశారు. ఈ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నామని, అతడు అరెస్టయిన మాట మాత్రం వాస్తవమని స్నో షూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మీర్ ముదసిర్ తెలిపారు. ఫిబ్రవరి 23 నుంచి 25వ తేదీ వరకు జరిగిన 2017 ప్రపంచ స్నో షూ చాంపియన్‌షిప్ పోటీలలో హుసేన్ పాల్గొన్నాడు. వాస్తవానికి గురువారం అక్కడినుంచి బయల్దేరాల్సి ఉండగా, బుధవారమే అరెస్టయ్యాడు.
అయితే, తాను నిర్దోషినని, ఎలాంటి నేరం చేయలేదని హుస్సేన్ అంటున్నాడు.
వాస్తవానికి హుసేన్‌తో పాటు ఖాన్ అనే మరో క్రీడాకారుడికి కూడా అమెరికా వెళ్లేందుకు వీసా నిరాకరించారు. అయితే గ్రామ సర్పంచ్ ఈ విషయాన్ని అమెరికా సెనేటర్ల సాయంతో పైవరకు తీసుకెళ్లడంతో ఎట్టకేలకు వీసా వచ్చింది. స్థానికులు వాళ్లకు ఉచితంగా వసతి కల్పించడంతో పాటు భోజనం పెట్టి, వారం రోజుల పాటు వాళ్ల ప్రయాణ ఖర్చుల కోసం లక్ష రూపాయలకు పైగా విరాళాలు కూడా వసూలు చేసి ఇచ్చారు. హుస్సేన్‌కు న్యాయ సహాయం అందిస్తున్నామని, ఈ విషయాన్ని అమెరికాలో ఉన్న భారత రాయబార కార్యాలయంతో అటార్నీ చర్చిస్తారని ముదసిర్ చెప్పారు. హుసేన్‌కు ఇంగ్లీషు మాట్లాడటం రాకపోవడంపతో ఆ ప్రాంతంలో ఉండే రెండు భారతీయ కుటుంబాలు అతడికి సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. వ్యక్తిగతంగా ఈ వివాదంతో తాను చాలా ఇబ్బంది పడుతున్నానని, అమెరికన్ చట్టాల మీద దనకు పూర్తి విశ్వాసం ఉందని, చట్టం తన పని తాను చేసుకెళ్తుందని ముదసిర్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







