కోల్‌కతాలో ఐసీసీ ట్రోఫీ

- March 03, 2017 , by Maagulf
కోల్‌కతాలో ఐసీసీ ట్రోఫీ

హైదరాబాద్: ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో ఐసీసీ ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనుంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ పర్యటన మొదలైంది. ఈ పర్యటనలో భాగంగా గురువారం కోల్‌కతాకు చేరుకున్న ట్రోఫీని మాజీ క్రికెటర్‌ దీప్‌ దాస్‌గుప్తా, సినీ నటి రీతాబారి దాస్‌గుప్తా ఆవిష్కరించారు.
శుక్రవారం ఈ ట్రోఫీ ముంబైకి, ఆ తర్వాత బెంగళూరు, ఢిల్లీలోని ప్రధాన పట్టణాల్లో ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి 21వ తేదీన దుబాయిలో ఐసీసీ ఆధ్వర్యంలో ఈ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఐసీసీ నిర్వహించే ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీలో 8 దేశాల జట్లు పాల్గొంటున్నాయి.
దీంతో ట్రోఫీలో పాల్గొనే 8 దేశాల్లోని 19 ప్రధాన పట్టణాల్లో ట్రోఫీ పర్యటన సాగనుంది.
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఈ ట్రోఫీ అనంతరం బంగ్లాదేశ్‌ చేరుకోనుంది. అక్కడ నుంచి శ్రీలంక, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌కు తీసుకెళతారు.
ట్రోఫీని ఆవిష్కరించిన దీప్‌ దాస్‌గుప్తా
గురువారం కోల్‌కతాకు చేరుకున్న ట్రోఫీని మాజీ క్రికెటర్‌ దీప్‌ దాస్‌గుప్తా, సినీ నటి రీతాబారి దాస్‌గుప్తా ఆవిష్కరించారు.
జూన్ 1 నుంచి 18 వరకు
జూన్ 1 నుంచి 18 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్న మొత్తాన్ని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో నాలుగేసి జట్లు ఉన్నాయి. గ్రూపులోని మిగతా మూడు జట్లతో ఒక్కో జట్టు ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూపులోని తొలి రెండు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌ను పాక్‌తో జూన్‌ 4న తలపడనుంది.
గ్రూపు వివరాలు:
గ్రూపు ఏ : ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌. 
గ్రూపు బి : పాకిస్థాన్‌, టీమిండియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్:
1 జూన్ 2017 ఇంగ్లాండ్ Vs బంగ్లాదేశ్ (గ్రూప్ ఎ) ఓవల్, లండన్
2 జూన్ 2017 ఆస్ట్రేలియా Vs న్యూజిలాండ్ (గ్రూప్ ఎ) ఎడ్గ్బాస్టన్, బర్మింగ్హామ్
3 జూన్ 2017 దక్షిణాఫ్రికా Vs శ్రీలంక (గ్రూప్ బి) ఓవల్, లండన్
4 జూన్ 2017 భారత్ Vs పాకిస్థాన్ (గ్రూప్ బి) ఎడ్గ్బాస్టన్, బర్మింగ్హామ్
5 జూన్ 2017 ఆస్ట్రేలియా Vs బంగ్లాదేశ్ (గ్రూప్ ఎ) ఓవల్, లండన్
6 జూన్ 2017 ఇంగ్లాండ్ Vs న్యూజిలాండ్ (గ్రూప్ ఎ) కార్డిఫ్, వేల్స్
7 జూన్ 2017 పాకిస్థాన్ Vs దక్షిణాఆఫ్రికా (గ్రూప్ B) ఎడ్గ్బాస్టన్, బర్మింగ్హామ్
8 జూన్ 2017 భారత్ Vs శ్రీలంక (గ్రూప్ బి) ఓవల్, లండన్
9 జూన్ 2017 న్యూజిలాండ్ Vs బంగ్లాదేశ్ (గ్రూప్ ఎ) కార్డిఫ్, వేల్స్
10 జూన్ 2017 ఇంగ్లాండ్ Vs ఆస్ట్రేలియా (గ్రూప్ ఎ) ఎడ్గ్బాస్టన్, బర్మింగ్హామ్
11 జూన్ 2017 భారతదేశం Vs దక్షిణాఫ్రికా (గ్రూప్ బి) ఓవల్, లండన్
12 జూన్ 2017 శ్రీలంక Vs పాకిస్థాన్ (గ్రూప్ బి) కార్డిఫ్, వేల్స్
14 జూన్ 2017 1 వ సెమీఫైనల్ (గ్రూప్ ఎ విజేతలు Vs గ్రూప్ బి రన్నర్స్) కార్డిఫ్, వేల్స్
15 జూన్ 2017 2 వ సెమీఫైనల్ (గ్రూప్ బి విన్నర్స్ Vs గ్రూప్ ఎ రన్నర్స్) ఎడ్గ్బాస్టన్, బర్మింగ్హామ్
18 జూన్ 2017 ది ఫైనల్ ది ఓవల్, లండన్
19 జూన్ 2017 ఫైనల్ కోసం రిజర్వు డే

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com