వీకెండ్‌లో గ్రేట్ ఫ్యామిలీ ఫన్ - దుబాయ్ బోట్ షో
- March 04, 2017
వారాంతంలో దుబాయ్ వాసుల్ని అలరించేందుకు సిద్ధమయ్యింది 25వ దుఆయ్ ఇంటర్నేషనల్ బోట్ షో. ఫ్యామిలీ ఎంజాయ్‌మెంట్‌కి ఈ షో ఎంతో ప్రత్యేకమైనదని నిర్వాహకులు అంటున్నారు. డేర్‌డెవిల్ వాటర్ స్పోర్ట్ అయిన ఈ బోట్ షో ఈ వీకెండ్‌లో పెద్దయెత్తున సందర్శకుల్ని ఆకట్టుకోనుంది. డెడికేటెడ్ కిడ్స్ ఎరీనా, వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఫ్రీ సెయిలింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇలా దుబాయ్ ఇంటర్నేషనల్ మెరీనా క్లబ్ అన్ని వయసులవరారికీ ప్రత్యేకమైన అనుభూతిని మిగల్చనుంది. ఫుట్ బాల్ మైదానం అంతటి స్థాయిలో లగ్జరీ యాచ్‌ట్ ఆహూతుల్ని అలరించనుంది. వీటితోపాటుగా లగ్జరీ కార్లను ఇష్టపడేవారి కోసం కార్ల షో కూడా ఉంటుంది. బెంట్లే కాంటినెంటల్ జిటి, మెక్‌లారెన్ 570 జిటి, మసెరాటి లెవాంటె, మెర్సిడెస్ బెంజ్ జి500, ఆస్టన్ మార్టిన్, లాంబోర్గాని హరికేన్ కార్లు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. విజిటర్స్ కోసం స్కైడైవ్ దుబాయ్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి షటిల్ బస్సుల ద్వారా ఆయా ప్రాంతాలకు చేరుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 9.30 వరకు ఈ ఫన్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కో టిక్కెట్ ధర 60 అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్స్. ఆన్‌లైన్‌లో ముందుగా బుకింగ్ చేసుకున్నవారికి 15 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









