షార్జా, అజ్మాన్‌లో విడుదల కానున్న ఖైదీలు
- September 22, 2015
వివిధ దేశాలకు సంబంధించిన 132 మంది ఖైదీలు షార్జా ఎమిరేట్స్‌లో 'ఈద్ అల్ అదా' సందర్భంగా విడుదల కానున్నారు. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, మరియు షార్జా పాలకుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్, సత్ప్రవరన కలిగిన మరియు సగం శిక్షా కాలం పూర్తి చేసుకున్న వారిని విడుదల చేయనున్నారు. ఈ విడుదలతో ఖైదీల బంధవుల్లో ఈద్ ఆనందాన్ని తీసుకువస్తుందని ఆశిస్తున్నారు. షార్జా చీఫ్ పోలీస్, బ్రిగేడియర్ సైఫ్ మహ్మద్ అల్ జిరి అల్ షామి, షార్జా పాలకుడి చొరవకు ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి ఎలాంటి తప్పిదాలకూ పాల్పడకుండా మంచి పౌరులుగా జీవిస్తారనీ విడుదల కానున్న ఖైదీల గురించి అభిప్రాయపడ్డారు అల్ షమీ. అజ్మాన్‌లో 72 మంది ఖైదీలను విడుదల చేయాలని సుప్రీం కౌన్సిల్ మెంబర్, మరియు పాలకుడు షేక్ హుమాయిద్ బిన్ రషిద్ అల్ నువామి నిర్ణయించారు. షేక్ హుమాయిద్ క్షమాభిక్ష ఆ ఖైదీలు కొత్త జీవితం ప్రారంభించేందుకు ఉపకరిస్తుంది. అజ్మాన్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్, బ్రిగేడియర్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ మాట్లాడుతూ, షేక్ హుమాయిద్కి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలపాలన్నారు. ఖైదీలు విడుదలయ్యాక మేటి పౌరులుగా ప్రవర్తించాలని కోరారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!







