లైంగిక సామర్థ్యం పెరగాలంటే.. పుచ్చకాయ-పాలకూర జ్యూస్ తాగేయండి..

- March 04, 2017 , by Maagulf
లైంగిక సామర్థ్యం పెరగాలంటే.. పుచ్చకాయ-పాలకూర జ్యూస్ తాగేయండి..

వేసవిలో పుష్కలంగా లభించే పుచ్చకాయ రసాన్ని తీసుకుంటే లైంగిక పటుత్వం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పుచ్చకాయను నేచురల్ వయగ్రా అంటారు. పుచ్చకాయ రసంలో కాస్త నిమ్మరసం కలిపి తాగితే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు. అలాగే నారింజ పండును లేదా జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా శృంగారంలో రసానుభూతిని పొందవచ్చును. 
 
ఇక మునగాకు మొనగాడిని చేస్తుంది. మునగాకు కూరలు, తాళింపులు రెగ్యులర్‌గా తీసుకుంది. స్తంభించిన జీవితం స్పందిస్తుంది. దీనిని దేశీ వయగ్రా అని కూడా అంటారు. అలాగే వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది పర్టులిటీని పెంచుతుంది. ఇందులోని విటమిన్ బీ6 కామోద్ధీపనకు కారణం అవుతుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. కామ సామ్రాజ్యానికి కింగైపోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇకపోతే.. దానిమ్మ వీర్యకణాలను పెంచుతుంది. అరటి పండు కూడా స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. చేపల్లో ఒమేగా3, 6 కామోద్ధీపనకు ఉపయోగపడుతుంది.  ముఖ్యంగా సాల్మన్ ఫిష్ తీసుకోవడం మంచిది. ఇదే విధంగా పాలకూర, టమోటా, మిరపకాయలు కూడా శృంగారంలో రసానుభూతిని పొందేందుకు ఉపయోగపడతాయి. పాలకూరలోని ఫోలిక్ యాసిడ్ వీర్య వృద్ధికి ఉపయోగపుడుతుంది. ఇందులో ఐరన్, విటమిన్ సి.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
అలాగే పచ్చి పాలకూర జ్యూస్ తీసుకుంటే వీర్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇక మిరపకాయ మేల్ ఫర్టిలిటీని పెంచుతుంది. టమోటాలోని కెరటనాయిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు వీర్యకణాలను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com