మార్చి 17న 'ఓ పిల్లా నీ వల్లా'..

- March 05, 2017 , by Maagulf
మార్చి 17న 'ఓ పిల్లా నీ వల్లా'..

కిషోర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో బిగ్ విగ్ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌ నిర్మిస్తున్న‌ చిత్రం `ఓ పిల్లా నీ వ‌ల్లా`. కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా న‌టీన‌టులు. ఇటీవ‌లే రిలీజ్ చేసిన‌ ఆడియోకి మంచి స్పంద‌న వ‌చ్చింది. ద‌ర్శ‌క‌నిర్మాత కిషోర్ ఓ అభిరుచి గ‌ల చిత్రాన్ని తెర‌కెక్కించార‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.
టాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఆవిష్క‌రించిన‌ మోష‌న్ పోస్ట‌ర్‌కి, యంగ్ హీరో శ‌ర్వానంద్ రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కి టాలీవుడ్ ప్ర‌ముఖులు స‌హా ప్రేక్ష‌కాభిమానుల నుంచి, ప‌రిశ్ర‌మ నుంచి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మార్చి 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com