'ఫ్లిప్కార్ట్' నుంచి శుభవార్త
- March 05, 2017
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ శుభవార్త చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం అధికంగా ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సంస్థ సీవోవో నితిన్ సేథీ తెలిపారు. పోటీ సంస్థ స్నాప్డీల్ ఉద్యోగులకు పింక్ స్లిప్లు ఇస్తుంటే ఫ్లిప్కార్ట్ మాత్రం ఉద్యోగుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు రచిస్తుండడం గమనార్హం. మార్కెట్లో తనకు ప్రధాన పోటీగా ఉన్న అమెజాన్ను మరింత దీటుగా ఎదుర్కొనే ఉద్దేశంలో భాగంగానే ఉద్యోగులను పెంచుతున్నట్టు సమాచారం. ఉద్యోగుల సంఖ్యను పెంచి వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సంస్థను విస్తరిస్తామని నితిన్ వివరించారు. గతేడాది ఫ్లిప్కార్ట్ 1500 మంది ఉద్యోగులను తీసుకుంది.
ప్రస్తుతం ఈ సంస్థలో పదివేల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు మరో 30 శాతం మందిని తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







