తెలంగాణ వాసికి సౌదీ షేక్ ఆపన్నహస్తం
- March 05, 2017
పదేళ్లుగా జైలుజీవితం గడిపిన ఓ భారతీయుడికి సౌదీ కోర్టు విముక్తి కల్పించింది. అది కూడా అతను 10 లక్షల రియాల్స్ చెల్లిస్తేనే విడిచిపెట్టింది. కానీ డబ్బు చెల్లింపు వెనుకాల సౌదీ యజమాని దాతృత్వం బయటపడింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన చేపూరి లింబాద్రి కొన్ని సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లాడు. అనూహ్యంగా అతను ఒక హత్య కేసులో నిందితుడుగా చేర్చబడ్డాడు. దీంతో కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. ఒకవేళ శిక్ష తప్పించుకోవాలంటే మాత్రం 10 లక్షల రియాల్స్ చెల్లించాలని తీర్పు చెప్పింది. అప్పటినుంచి అతను సుమారు పదేళ్లుగా జైళ్లోనే ఉన్నాడు. అంత డబ్బు తాను కట్టే పరిస్థితులు లేకపోవడంతో, ఇక ఎప్పటికీ తాను స్వదేశానికి వెళ్లలేననుకున్నాడు. కానీ, ఆయన పనిచేస్తున్న కంపెనీ యజమాని సౌదీ షేక్ ఆ మొత్తం డబ్బు చెల్లించారు. అతని విడుదలకు సహాయపడ్డారు. కేంద్రప్రభుత్వ చొరవతోనే ఇది సాధ్యమయిందని లింబాద్రి తెలిపాడు. ఈ రోజే హైదరాబాద్ చేరుకున్న ఆయన సౌదీ షేక్‌కు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపాడు.
తాజా వార్తలు
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







