'ఇంటర్నేషనల్‌ విమెన్‌ డే' సెలబ్రేషన్స్‌

- March 06, 2017 , by Maagulf

మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో సాధించిన విజయాల నేపథ్యంలలో ఇంటర్నేషనల్‌ విమెన్స్‌ డే సెలబ్రేషన్స్‌కి ఎంతో ప్రత్యేకత ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దుబాయ్‌లోని 8 మంది ప్రముఖ మహిళలను ఆయా రంగాల్లో ప్రముఖులుగా ఎంపిక చేశారు. ఒక్కో దేశం నుంచి ఒక్కొక్కరిని ఆయా రంగాల్లో సాధించిన ఘనత నేపథ్యంలో ప్రముఖ మహిళలుగా గుర్తించారు. ఆ మహిళలు వీరే.. 
ఇవిలియా మెండోంకా - ఇండియా 
అన్నా మరినా సిమోన్‌ - రొమేనియా 
స్టెల్లా జాన్‌ - నైజీరియా 
ఎమ్మా క్రెటర్‌ - జర్మనీ 
అక్సా ఇల్లాహి - పాకిస్తాన్‌ 
అనా - మరాని సిమియోన్‌ - రొమనికా 
సిమోనా - చైనా 
మోనిక - స్పెయిన్‌ 
వెగాస్‌ లాంజ్‌, దుబాయ్‌ సహకారంతో సెలబ్రేషన్స్‌ని ఒవిలియా మెండోంకా నిర్వహించారు. పూర్తిగా మహిళలే దీన్ని నిర్వహించడం జరిగింది. సిమోనా స్టాన్సియు - ఫొటోగ్రషీ, సమా కినమ్‌ - మేకప్‌ అందించారు. అనా - మారియా సిమోన్‌ టీమ్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నిమిషా, నికిల్‌ జోషి తదితరులకూ కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు అంర్గతంగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారనీ, ఆ సమస్యలపై యుద్ధం చేసి విజేతలుగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com