హ్యాపీ బర్త్ డే శర్వానంద్
- March 06, 2017
వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ప్రస్తుతం కెరీర్ పీక్స్ లో ఉన్నాడు. ఇటీవలే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వా "శతమానం భవతి" సూపర్ హిట్టయ్యింది. హీరోగా శర్వా రేంజ్ ని మరింత పెంచింది. ఇప్పటికే శర్వా 24 సినిమాలు పూర్తి చేశాడు. తన 25వ సినిమాగా 'రాధా'తో రాబోతున్నాడు. 'రాధా'లో ఫస్ట్ టైం పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ పాతిక సినిమాల ప్రస్థానాన్ని గమనిస్తే.. శర్వానంద్ ఎంత డిఫరెంట్ అనేది తెలుస్తోంది. అందరి హీరోల్లాగా హిట్టు, ఫ్లాపు ఫార్ములాని అస్సలు ఫాలో కాలేదు ఈ యంగ్ హీరో. శర్వాకి తెలిసిందల్లా ఒక్కటే.. చేసిన పాత్ర మళ్లీ చేయకూడదు.
ఇప్పటి వరకు చేసిన 25 సినిమాల్లో ఒకదానికొక్కటి అస్సలు పోలికే ఉండదు. నటుడిగా అది నాకు సంతృప్తినిస్తుమ్దని చెప్పుకొంటాడు శర్వా. ఈ యంగ్ హీరోకి కథే ముఖ్యం. అది నచ్చితేనే సినిమాకి ఓకే చెప్పడం అలవాటు చేసుకొన్నాడు. ఇక, చిన్న దర్శకుడు, పెద్ద దర్శకుడు, రెమ్యూనరేషన్.. లెక్కలేవీ.. వేసుకోడు.
స్టార్ హీరోలు సైతం శర్వా కథల ఎంపికని చూసి కుల్లుకుంటారు. ఎందుకంటే ? శర్వా చేసిన విభిన్నమైన సినిమాలు స్టార్ హీరోలు కూడా చేయలేదు. అందుకే.. శర్వా సినిమా ఉంటే కంటెంట్ ఉన్న సినిమాగా ముద్రపడిపోయింది. ఆయన సినిమా టైటిల్ ప్రకటించగానే.. చూసేయాలని డిసైడైపోతారు ప్రేక్షకులు. అంతగా ప్రేక్షకుల్లో నమ్మకం కలిగించాడు శర్వా. ఓ నటుడికి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి.
ఇక, శర్వానంద్ పర్సనల్ విషయాలకొస్తే.. విజయవాడలోని తన తాతగారింట్లో జన్మించాడు శర్వా. పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే. నాన్న ప్రసాదరావు వ్యాపారవేత్త. అమ్మ వసుంధరాదేవి గృహిణి. అన్నయ్య కల్యాణ్, అక్క రాధిక. శర్వానంద్ బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, రానా దగ్గుపాటి శర్వా క్లాస్ మేట్స్.
స్కూల్ విద్యార్థిగా ఉండగానే తన గమ్యం సినిమా అని ఫిక్సయ్యాడు. ఆ వైపుగానే అడుగులు వేశాడు. 2003లో 'ఐదో తారీఖు' సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేశాడు శర్వా. స్రవంతి రవికిషోర్ 'యువసేన' సినిమాలో నలుగురు హీరోల్లో ఒక పాత్ర ఇచ్చారు. అది హిట్టవడంతో మంచి పేరొచ్చింది. కానీ, సోలో హీరోగా అవకాశాల్లేవ్. దీంతో.. చిన్ని పాత్రల్లో మెరిశాడు. వెంకీ 'లక్ష్మీ', మెగాస్టార్ 'శంకర్ దాదా జిందాబాద్' సినిమాలో నటించాడు. 'అమ్మచెప్పింది' శర్వాలోని నటుడిని పరిచయం చేసింది. వీధి, క్లాస్ మేట్ చిత్రాలు చేశాడు.
అయితే, 2008లో వచ్చిన 'గమ్యం' శర్వానంద్ ని హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత రాజు మహారాజు, ప్రస్థానం, అందరి బంధువయ, నువ్వానేనా, కో అంటే కోటీ, సత్య2 సినిమాలు శర్వా ఎంత విలువైన నటుడు తెలిపాయి. ఇక, 'రన్ రాజా రన్' నుంచి శర్వా స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, శతమానం భవతి సినిమాలు నాని రేంజ్ ని మరింతగా పెంచేశాయి. శర్వా తాజా చిత్రం 'రాధా' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం కూడా ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటూ.. ఈరోజు పుట్టినరోజు జరుపుకొంటున్న శర్వానంద్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్ డాట్ కామ్.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!