బంపర్ ఆఫర్ ఎయిర్‌టెల్లో

- March 06, 2017 , by Maagulf
బంపర్ ఆఫర్ ఎయిర్‌టెల్లో

జియో దెబ్బకు దిగివస్తున్న మిగితా టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లతో ఖాతాదారులను రక్షించుకునే పనిలో పడ్డాయి. ఈ ప్రభావం దిగ్గజ టెలికాం 'ఎయిర్‌టెల్'పై బాగానే పడింది. దీంతో ఎయిర్‌టెల్ సైతం అనేక ఆఫర్లను ప్రకటించింది. రూ.345 రీఛార్జ్ ప్యాక్‌పై రోజూ 1 జీబీ డేటా, అదనంగా కాల్స్ సదుపాయం కూడా ఇందులో భాగమే. అయితే ఇప్పుడు మరో సర్‌ప్రైజింగ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ యూజర్లకు ఉచిత డేటాను అందించడం ఈ ఆఫర్ ముఖ్య ఉద్దేశం. మార్చి 13 నుంచి యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ఖాతాదారులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించనున్నారు. 'మై ఎయిర్‌టెల్' యాప్ ద్వారా వివరాలు స్పష్టం కానున్నట్లు సమాచారం.
దేశంలోని అత్యంత వేగంగా మొబైల్ నెట్‌వర్క్‌ నుంచి ఈ సేవలను పొందవచ్చని, ఎయిర్‌టెల్‌ ఖాతాదారులు పంపిన ఈ మెయిల్‌ సమాచారంలో తెలిపింది. అయితే మార్చి 13నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఆశ‍్చర్యకరమైన ఆఫర్‌ లో డ్యాటా సేవలు ఏ మేరకు అందించనుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com