ఇకపై నిస్సంకోచంగా డబ్బుల్ని పంపించొచ్చు
- March 06, 2017
భారతదేశంలో డిమానిటైజేషన్ కారణంగా ఏర్పడ్డ కరెన్సీ సంక్షోభంతో యూఏఈలోనూ ఇండియన్స్ పలు సమస్యల్ని ఎదుర్కొన్నారు. తమవారికి డబ్బులు పంపించడానికోసం నానా పాట్లూ పడాల్సి వచ్చింది వారంతా. అయితే నగదు ఉపసంహరణ పరిమితిని సడలించడంతో ఇకపై ఎంత మొత్తమైనాసరే భారతదేశానికి నగదు పంపించుకోవడానికి వీలు కలిగింది. 55,000 ఎక్స్ప్రెస్ మనీ ఔట్లెట్స్ ద్వారా ఎవరైనాసరే ఎంతమొత్తమైనా కలెక్ట్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. నోట్ల రద్దు, నగదు కొరత కారణంగా వినియోగదారులు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందనీ, రిజర్వు బ్యాంకు నిబంధనల్ని సడలించడంతో పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని ఎక్స్ప్రెస్ మనీ నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 20 నుంచి రిజర్వు బ్యాంకు రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని 50,000 వరకు పెంచింది. మార్చ్ 13తో ఈ పరిమితి పూర్తిగా తొలగిపోనుంది.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్