వలసదారుడి భౌతిక కాయం తరలింపు
- March 07, 2017
భారతీయ వలసదారుడు గురుస్వామి మూక్కాన్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించనున్నారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గుండెపోటుకి గురై గురుస్వామి మృతి చెందారు. గురుస్వామి మృతదేహాన్ని చెన్నయ్ విమానాశ్రయంలో ఆయన సోదరుడు సుబ్రహ్మణ్యం రిసీవ్ చేసుకుంటారని సామాజిక కార్యకర్త బషీర్ అంబలాయి చెప్పారు. గత శుక్రవారం గురుస్వామి, బహ్రెయిన్‌లో గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. సౌదీ వీసా రెన్యువల్ అనంతరం గల్ఫ్ ఎయిర్ విమానంలో రియాద్ నుంచి పయనమయ్యారు. అయితే మార్చ్ 3న బహ్రెయిన్ నుంచి చెన్నయ్‌కి వెళుతుండగా, బహ్రెయిన్ విమానాశ్రయంలో గుండెపోటు వచ్చింది. బహ్రెయిన్‌లోని ఆసుపత్రికి అతన్ని తరలించగా, అక్కడే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. తమిళనాడులోని కూక్కడికి చెందిన వ్యక్తి గురుస్వామి. మృతుడి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపింది గల్ఫ్ ఎయిర్.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







