నిబంధనలు ఉల్లంఘిస్తే 200,000 జరీమానా తప్పదు

- March 08, 2017 , by Maagulf
నిబంధనలు ఉల్లంఘిస్తే 200,000 జరీమానా తప్పదు

ఏప్రిల్‌ నాటికి సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న కార్మికులకు సరైన సౌకర్యాలు కల్పించని పక్షంలో 200,000 దిర్హామ్‌ల వరకు జరీమానా చెల్లించవలసి ఉంటుందని అధికారిక వర్గాలు హెచ్చరించాయి. అబుదాబీ మునిసిపాలిటీ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముసాఫ్ఫా ఇండస్ట్రియల్‌లో ముఖ్యంగా పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయనీ, అక్కడ సరైన అకామడేషన్‌ కల్పించాలని, భద్రతా ప్రమాణాల్ని నిబంధనలకు అనుగుణంగా మార్చవలసి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్‌ 6 వరకు పలు సంస్థలకు డెడ్‌లైన్‌ విధించారు. ఈలోగా సౌకర్యాలను మెరుగపర్చాలి. లేనిపక్షంలో భారీ జరీమానాలు తప్పవు. ఎప్పటికప్పుడు చేస్తున్న తనిఖీలతో కార్మికుల భద్రతపైనా, వారు పనిచేసే ప్రాంతంలో శుభ్రతపైనా ఉల్లంఘనల్ని గుర్తించి జరీమానాలు విధిస్తున్నామనీ, హెచ్చరికలు జారీ చేస్తున్నామనీ అయినప్పటికీ కొన్ని సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. అందుకే ఇకనుంచి జరీమానాలు భారీ స్థాయిలో విధించనున్నట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com