చికాగో ఆంధ్ర సంఘం ఆందోళన భారతీయులపై జరుగుతున్న దాడులపై
- March 08, 2017
అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులపై చికాగో ఆంధ్ర సంఘం, ఇండియన్ కమ్యూనిటీ అవుడ్ రీచ్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అరోరా సిటీలో ICO అధ్యక్షుడు కృష్ణ బన్సల్ అధ్యక్షత ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి యుఎస్ కాంగ్రెస్ సభ్యులు రాజా క్రిష్ణమూర్తితోపాటు తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, ఇమ్మిగ్రేషన్ ఆటార్నీ భాను ఇలింద్రతోపాటు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కూచిభొట్లకు నివాళులు అర్పించారు. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని.. వీలైనంత వరకు వివాదాలకు, అనవసర ప్రసంగాలకి దూరంగా ఉండటం మంచిదని తానా అధ్యక్షుడు జంపాల చౌదరి సూచించారు. అన్నారు. ఇమ్మిగ్రేషన్ అటార్నీ భాను మాట్లాడుతూ.. ట్రంప్ విధానాల వల్ల భారతీయులకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమి లేదన్నారు. H1B, గ్రీన్ కార్డు వాళ్లు నిరభ్యంతరంగా ఉద్యోగాలు చేసుకోవచ్చన్నారు. మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని.. ఎదైనా అనుమానాలుంటే తమ కంపెనీకి చెందిన లాయర్ల సలహా తీసుకోవాలి అని సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు