భజన గీతాలు పాడిన ముస్లిమ్ బాలిక
- March 08, 2017
హిజాబ్ ధరించిన ఓ ముస్లిమ్ బాలిక కన్నడ టీవీ ఛానల్ రియాల్టీ షోలో హిందూమతానికి చెందిన భజన గీతాలు పాడి అందరినీ ఆకట్టుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా సాగర్ తాలూకాకు చెందిన సయ్యద్ సుహానా హిజాబ్ ధరించి వచ్చి ఓ కన్నడ టీవీ ఛానల్ లో హిందూమత భజన గీతాలు పాడింది. ముస్లిమ్ బాలిక సుహానా భజన గీతాలు పాడి హిందూ ముస్లిమ్ ల ఐక్యతకు మారుపేరుగా నిలిచారని రియాల్టీ షో జడ్జీలు అభినందించారు. కాగా ఇలా భజనగీతాలు పాడటం తప్పని మంగళూరు ముస్లిమ్ లు కొందరు ఫేస్ బుక్ పేజీలో వ్యాఖ్యలు చేశారు. నెటిజన్లు ముస్లిమ్ బాలికకు అండగా నిలవడంతో మంగళూరు ముస్లిమ్ లు పెట్టిన కామెంట్లను తొలగించారు.
మొత్తంమీద సుహానా భక్తిగీతాలు పాడి మతసామరస్యాన్ని మరోసారి సమాజానికి చాటిచెప్పింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు