బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక కన్నుల పండుగగా జరిగింది

- March 09, 2017 , by Maagulf
బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక కన్నుల పండుగగా జరిగింది

బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక బుధవారం కన్నుల పండుగగా జరిగింది. బెంగుళూరు వేదికగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి క్రీడా ప్రముఖలందరూ హాజరయ్యారు. వీరితో పాటు టీమిండియా, అవార్జు విజేతలు ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు.
టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ పాలీ ఉమ్రిగర్‌ అవార్డును, స్పిన్నర్‌ అశ్విన్‌ 'దిలీప్‌ సర్దేశాయ్‌' అవార్డును అందుకున్నారు. పాలీ ఉమ్రిగర్‌ అవార్డును మూడుసార్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. 2015-16 సీజన్‌లో అద్భుత ప్రదర్శనకు గాను ఈ అవార్డు వరించింది.
ఇక కల్నల్ సీకే నాయుడు అవార్డును స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్వీకరించాడు. భారత మహిళా క్రికెట్‌ జట్టు సారథి మిథాలీ రాజ్‌కు 'బెస్ట్‌ ఉమన్‌ క్రికెటర్‌' అవార్డు దక్కింది.
రాజిందర్‌ గోయెల్, పద్మాకర్‌ శివాల్కర్‌లకు కల్నల్‌ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం దక్కగా, శాంత రంగస్వామికి మహిళల కేటగిరీలో బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారం లభించింది.
ఇక టైగర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారక ఉపన్యాసాన్ని భారత మాజీ వికెట్‌కీపర్ ఫారుఖ్ ఇంజినీర్ వెలువరించారు. బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకకు సంబంధించిన ఫోటోలు మీకోసం:
బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకకు హాజరైన టీమిండియా
బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక బుధవారం కన్నుల పండుగగా జరిగింది. బెంగుళూరులోని రిట్జ్ కార్టన్ హోటల్ వేదికగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి క్రీడా ప్రముఖలందరూ హాజరయ్యారు. వీరితో పాటు టీమిండియా, అవార్జు విజేతలు ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com