అక్రమ స్ట్రీట్ వెండర్స్ తొలగింపు
- March 09, 2017
80కి పైగా అక్రమ వెండింగ్ పాయింట్స్‌ని సదరన్ గవర్నరేట్ పరిధిలో తొలగించబడ్డాయి. సదరన్ ఏరియా మునిసిపాలిటీ, ఈ విషయాన్ని వెల్లడించింది. 85 ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల నేపథ్యంలో ఈ తొలగింపు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇసాటౌన్లో 36 లొకేషన్లలో తొలగింపు జరగగా, రిఫ్ఫాలో 35, హజియాత్లో 14 తొలగింపులు చోటుచేసుకున్నాయి. ప్రజలకు హానికారకమైన ఇలాంటి వ్యాపారాల విషయంలో మునిసిపాలిటీ చాలా కఠినంగా వ్యవహరిస్తుందని అధికారులు చెప్పారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుంటామని, ఉల్లంఘనులపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అధికారులు. స్ట్రీట్ వెండర్స్‌కి సంబంధించి ఏమైనా అనుమానం ఉంటే పౌరులు మునిసిపాలిటీకి సమాచారమివ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా