భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 22 మంది పిల్లలు సజీవదహనమయ్యారు
- March 09, 2017
అమెరికాలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. గ్వాటెమాలా నగరంలోని సాన్‌జోస్ పిన్యులా ఆశ్రమంలో బుధవారం చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 22 మంది పిల్లలు సజీవదహనమయ్యారు. మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుం వీరంతా సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరంతా 18ఏళ్లలోపు వారనేనని చెప్పారు. కాగా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ ఆశ్రమంలో అనాథలు, వేరే ప్రాంతాల నుంచి పారిపోయి వచ్చిన పిల్లలు నివసిస్తున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే పరుపులకు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు.
500 మందికి నివసించగలిగే సామర్థ్యం ఉన్న ఈ ఆశ్రమంలో ప్రమాదం జరిగిన సమయంలో 800 మంది ఉన్నట్లు గుర్తించారు. ఆశ్రమంలో ఉంటున్న పిల్లల్లో కొందరు తమకంటే చిన్నవారితో తరచూ గొడవ పడుతూ వారిపై ఘర్షణకు దిగుతుంటారని.. ఆ బాధ భరించలేక చాలా మంది చిన్నారులు ఆశ్రమం వదిలి వెళ్లిపోయారని అధికారులు తెలిపారు.
మంగళవారం రాత్రి నుంచే ఆశ్రమంలో అల్లర్లు తీవ్రమైనట్లు అధికారులు చెప్పారు. కాగా, ఇది చాలా విషాదకరమైన ఘటన అని గ్వాటెమాలా జాతీయ పోలీస్ అధికారి నేరీ రోమస్ తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!