'మీలో ఎవరు కోటీశ్వరుడు షో'లో పాల్గొన్న రంభ,చెర్రీ
- March 09, 2017
మెగాస్టార్ చిరంజీవి రంభ కాంబినేషన్ లో తెరకెక్కిన హిట్లర్, బావగారు బాగున్నారా, అల్లుడా మజాకా వంటి అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్.. కలెక్షన్ల వర్షం కురిపించాయి.. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ లో సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.. ఇక పవన్ కల్యాణ్ తో , బన్నితో సాంగ్స్ చేసి అలరించింది.. ఈ అచ్చతెలుగు భామ పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది.. కానీ విడాకులు, వరకట్న వేధింపులు వంటి వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నది..
కాగా ఈ భామ మెగాస్టార్ చిరంజీవి షో మీలో ఎవరు కోటీశ్వరుడు లో గెస్ట్ గా రామ్ చరణ్ తో కలిసి పాల్గొనడానికి వచ్చింది. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. చిరంజీవి, రామ్ చరణ్ ల మధ్యలో రంభ ఉన్న ఈ ఫోటో లో రంభ 40 ఏళ్ల వయసులో కూడా గ్లామర్ తో మిలమిలా మెరిసిపోతున్నది.. ఇక చరణ్ ఐతే ధృవ సినిమాలో కంటే మరింత స్టైలిస్ గా ఆకట్టుకొనేలా కనిపిస్తున్నాడు.. హోస్ట్ గా చిరంజీవి సూపర్ లుక్ లో అలరిస్తున్నాడు.. మరి ఈ షో ఎప్పుడు ఏ సమయంలో ప్రదర్శిస్తారో ప్రకటించాల్సి ఉంది.. కాగా రామ్ చరణ్ నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి వచ్చి.. తాను యాక్టింగ్ లోనే కాదు.. జనరల్ నాలెడ్జ్ పై కూడా పట్టుంది అని నిరూపించుకొన్నాడు.. మరి ఈ షోలో ఎంత గెలుచుకొన్నాడో చూడాలి మరి..
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్‌లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్‌లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్