మళ్లీ 'కిస్ ఆఫ్‌ లవ్' ఆందోళనకు రంగం సిద్ధం

- March 09, 2017 , by Maagulf
మళ్లీ 'కిస్ ఆఫ్‌ లవ్' ఆందోళనకు రంగం సిద్ధం

కేరళలో మరోసారి 'కిస్ ఆఫ్ లవ్' ఆందోళనకు రంగం సిద్ధమైంది. మహిళా దినోత్సవం నాడు కొచ్చిలో జరిగిన మోరల్ పోలీసింగ్ ఘటనకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టాలని స్వేచ్ఛావాదులు పిలుపునిచ్చారు. కొచ్చి మెరైన్ డ్రైవ్ మైదానంలో గురువారం సాయంత్రం 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. యువ జంటలపై శివసేన కార్యకర్తలు చేసిన దాడులకు నిరసనగా ఈ ఆందోళనకు దిగుతున్నట్టు ప్రకటించారు. మెరైన్ డ్రైవ్ మైదానానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కోజికోడ్ లోని ఓ హోటల్ లో భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు చేసిన దాడులకు వ్యతిరేకంగా 2014లో 'కిస్ ఆఫ్‌ లవ్' నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.


కాగా, కొచ్చి మోరల్ పోలీసింగ్ ఘటనలో కొచ్చి సెంట్రల్ సబ్-ఇన్స్ పెక్టర్ ను సస్పెండ్ చేశారు. ఎనిమిది మంది పోలీసులను ఆర్మెడ్ రిజర్వుడు పోలీసు క్యాంపుకు బదిలీ చేశారు. మోరల్ పోలీసింగ్ ఘటనను కొచ్చి మేయర్ సౌమిని జైన్ ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com