భారత ఐటీ రంగానికి పెద్ద దెబ్బ!

- March 09, 2017 , by Maagulf
భారత ఐటీ రంగానికి పెద్ద దెబ్బ!

హెచ్ 1 బీ, హెచ్ 4 వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భారత ఐటీ రంగానికి పెద్ద దెబ్బేనని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెచ్ 1 బీ వీసా నిబంధనలను కఠినతరం చేశాక ఇక హెచ్ 4 వీసాల మీద పడ్డాడు ట్రంప్. హెచ్ 1 బీ వీసాల మీద పనిచేస్తూ తమ పై ఆధారపడిన భార్య లేదా భర్తకు హెచ్ 4 వీసాలు ఇప్పించి యూఎస్ లో చట్టబద్ధంగా ఉంటున్న భారతీయులకు కొత్త ముప్పు వచ్చి పడింది.
గతంలో ఒబామా ప్రభుత్వం ఇలా డిపెండెంట్లకు కూడా భరోసా ఇచ్చింది. అయితే ఈ వెసులుబాటును సవాలుచేస్తూ అమెరికన్ సంస్థలు కొన్ని ఫెడరల్ కోర్టుకెక్కాయి.దీనిపై తమ వెర్షన్ వాదన వినిపించేందుకు ట్రంప్ పభుత్వం 60 రోజుల గడువు కోరింది. ఈ గడువులో అప్పుడే సుమారు సగం కాలం గడిచిపోయింది.
హెచ్ 4 డిపెండెంట్ వీసాకు సంబంధించిన బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించిన పక్షంలో ఇప్పటికే సవాలక్ష ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఇండియన్ ఐటీ సంస్థలు మరింత ముప్పును ఎదుర్కోవలసి ఉంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం.


వేలాది భారతీయ విద్యార్థుల ఉద్యోగాలకు డేంజర్ తప్పదు. ముఖ్యంగా ఐటీ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగినులు అకస్మాత్తుగా తమ జాబ్స్ కోల్పోతే ఆ పరిస్థితి, దాని ప్రభావం పరోక్షంగా ఈ రంగంపై పడుతుందని నాస్కాం వంటి ఐటీ రంగవర్గాలు భావిస్తున్నాయి. హెచ్ 1 వీసాల కోసం ప్రయత్నించాలన్న వేలమంది అభ్యర్థుల ఆశలపై నీళ్ళు చల్లినట్టే. ఇప్పటికే కొన్ని వారాలుగా ఇండియన్ ఐటీ రంగ పురోగతి కొంత మందగించింది. కరెన్సీ ఫ్లక్చ్యు యేషన్, తో బాటు క్లయింట్ స్పెండింగ్ కూడా తగ్గుముఖం పట్టింది. ఇండియన్ ఐటీ ఎగుమతుల వల్ల అమెరికాకు సుమారు 60 శాతం ఆదాయం లభిస్తోంది. అయితే హెచ్ 4 వీసాల మీద వేటు వేసిన పక్షంలో ఈ ఆదాయం తగ్గినప్పటికీ దానివల్ల అమెరికాకు పెద్ద నష్టం లేదు.


అమెరికన్లకే ఉద్యోగాలు అని పదేపదే వల్లె వేస్తున్న ట్రంప్ ఈ నష్టాన్ని తగ్గించుకోవడానికి అప్పుడే ప్లాన్ వేస్తున్నాడు. ఇందుకు ఉదాహరణగా కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇటీవల 49 మంది ఐటీ ఉద్యోగులకు ఉద్వాసన పలికి వారు చేసే పనిని ఇండియాలోని ఓ కంపెనీకి ఔట్ సోర్సింగ్ కి అప్పగించింది. తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇదే చిట్కా ప్రయోగించింది. తొలగించిన ఉద్యోగులకు ఇస్తున్న జీత భాత్యాలతో పోలిస్తే ఇలా వారి పనిని ఔట్ సోర్సింగ్ కి ఇవ్వడం వల్ల ఖర్చులు తగ్గి రెవెన్యూ పెరుగుతుంది. ఇన్ని సమస్యలు ఉన్నందువల్లే ట్రంప్ ప్రభుత్వం ఇండియన్ ఐటీ రంగాన్న్ని మరింత ప్రమాదంలో నెట్టే చర్యలకు పూనుకొంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com