సహచరుడ్ని హత్య చేసిన దుబాయ్ వర్కర్
- March 09, 2017
ఓ వ్యక్తి తన సహచరుడ్ని హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. హతుడు, హంతకుడు ఇద్దరూ పాకిస్తాన్‌కి చెందినవారే. హంతకుడు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మిడ్ డే బ్రేక్ సందర్భంగా ఇద్దరూ మాట్లాడుకుంటుండగా, ఇద్దరి మధ్యా ఓ విషయమై తగాదా చోటు చేసుకోవడంతో ఓ వ్యక్తి, ఇంకో వ్యక్తిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 2016, జులై 26న ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు తన కాలిని, ఇంకో వ్యక్తి మొహమ్మీద పెట్టగా, ఆ కాలి నుంచి వచ్చిన దుర్వాసనకి ఆ వ్యక్తి అసహనంతో, ఆగ్రహంతో ఊగిపోయి, గొడవకు దిగాడని వారిద్దరూ పనిచేస్తున్న సంస్థ సూపర్వైజర్ చెప్పారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడ్ని అంబులెన్స్‌లో తరలించామని, ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడని ఆయన వివరించారు. తన కుటుంబాన్ని దూషించడం వల్లనే తాను ఆ వ్యక్తిపై దాడి చేసినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఒమన్‌లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!







