డిఫేమేషన్‌పై కొత్త చట్టం

- March 10, 2017 , by Maagulf
డిఫేమేషన్‌పై కొత్త చట్టం

ఎమిర్‌ ఆఫ్‌ ఖతార్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమాద్‌ అల్‌ తని, లా నెంబర్‌ 4, 2017ను జారీ చేశారు. 2004, నెంబర్‌ 11 చట్టానికి కొన్ని సవరణలు చేస్తూ కొత్త చట్టం తీసుకువచ్చారు. ఇతరుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడటం, వారి వ్యక్తిగత విషయాల్ని బయటపెట్టడం వంటి నేరాలకు కఠినమైన చర్యల్ని ఈ చట్టంలో పేర్కొన్నారు. ఈ నేరానికిగాను 2 ఏళ్ళకు పైగా జైలు శిక్ష, అలాగే 10,000 ఖతారీ రియాల్స్‌ వరకు జరీమానా విధించేలా చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. 
ఇందులో, ఓ వ్యక్తికి చెందిన లెటర్‌ని ఆయన అనుమతి లేకుండా ఓపెన్‌ చేయడం, ఇతరుల టెలిఫోన్‌ సంభాషణను తెలుసుకోవడం, రికార్డ్‌ చేయడం, ఇంకొకరికి అందులో వివరాల్ని తెలియజేయడం, ఏ పరికరాన్నయినా ఉపయోగించి ఇతరుల వ్యక్తిగత ఫొటోల్ని తీసి, ప్రచారం చేయడం ఇందులో ముఖ్యమైన అంశాలు. వీటికి కఠినమైన శిక్షలుంటాయి. ప్రమాదాల్లో గాయపడ్డవారి ఫొటోలు లేదా వీడియోల్ని ప్రచారం చేసినా అవే శిక్షలు అమలవుతాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com