యూఏఈ మీడియా - వాక్‌ టు గివ్‌

- March 09, 2017 , by Maagulf
యూఏఈ మీడియా - వాక్‌ టు గివ్‌

యూఏఈ ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ 'ఇయర్‌ ఆఫ్‌ గివింగ్‌' ఇనీషియేటివ్‌ని ప్రారంభించగా, దానికి తమవంతు సహకారం అందించేందుకుగాను నేషనల్‌ మీడియా కౌన్సిల్‌ (ఎన్‌ఎంసి) 'వాక్‌ టు గివ్‌' అనే ఇనీషియేటివ్‌ని ప్రారంభించింది. మార్చ్‌ 17న జాయెద్‌ స్పోర్ట్స్‌ సిటీ నుంచి షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మాస్క్‌ వరకూ అఉదాబీలో 'మార్చ్‌' నిర్వహించనున్నారు మీడియా రంగానికి చెందిన ప్రతినిథులు. మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ అండ్‌ చైర్మన్‌ ఆఫ్‌ ది బోర్డ్‌ ఎన్‌ఎంసి డాక్టర్‌ సుల్తాన్‌ అహ్మద్‌ అల్‌ జబర్‌ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో పలు ముఖ్యమైన కార్యక్రమాలకు మీడియా మద్దతు అవసరమని అన్నారు. ఇయర్‌ ఆఫ్‌ గివింగ్‌ అనే గొప్ప ఇనీషియేటివ్‌కి మీడియా మద్దతు పలకడం చాలా గొప్ప విషయమని చెప్పారాయన. మంచి సమాజం కోసం మీడియా ప్రతినిథులు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందనీ, ఈ క్రమంలో యూఏఈ మీడియా ప్రతినిథుల పాత్ర ఎంతో గొప్పగా ఉందని అభిప్రాయపడ్డారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com