5వ వార్షిక మోటర్‌ షో నిర్వహించున్న బటెల్కో

- March 10, 2017 , by Maagulf
5వ వార్షిక మోటర్‌ షో నిర్వహించున్న బటెల్కో

బటెల్కో యాన్యువల్‌ మోటర్‌ షో మార్చ్‌ 17న సంస్థకు చెందిన హమాలా హెడ్‌ క్వార్టర్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనుంది. ఆష్రాఫ్స్‌, యూసుఫ్‌ ఎ వహాబ్‌ అల్‌ హవాజ్‌ అండ్‌ సన్స్‌, కో.డబ్ల్యుఎల్‌ఎల్‌, నేషనల్‌ మోటర్‌ కంపెనీ, బిన్‌ హిందీ మోటర్స్‌, ఆర్‌ఎంకె టైర్స్‌ అండ్‌ జనరల్‌ ఆటోమేటివ్‌ సర్వీసెస్‌ ఈ ఈవెంట్‌కి కీ స్పాన్సరర్స్‌గా వ్యవహరించనున్నారు. అదనపు సహకారాన్ని బటెల్కో పార్టనర్స్‌ (రెడ్‌ బుల్‌, బిఐసి) అందిస్తున్నాయి. కార్ల డిస్‌ప్లే, ఒక్కో కేటగిరీకీ బెస్ట్‌ త్రీ కార్స్‌, మోటర్‌ బైక్‌ డిస్‌ప్లే, వాటికీ మూడు అవార్డులు ఒక్కో కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది. విజిటర్స్‌ కూడా 'బెస్ట్‌ ఆఫ్‌ ది బెస్ట్‌' కేటగిరీ కోసం ఓటింగ్‌ చేసే అవకాశం ఉంది. ఈ ఈవెంట్‌లో మ్యూజిక్‌ షో ప్రధాన ఆకర్షణ కానుంది. పిల్లల కోసం కార్టింగ్‌, ఫుడ్‌ ఫెస్టివల్‌, అలాగే ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలు కూడా ఉంటాయిక్కడ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com