మణిరత్నం దర్శకత్వంలో రాంచరణ్‌, అరవింద్ స్వామి కాంబినేషన్ రిపీట్

- March 10, 2017 , by Maagulf
మణిరత్నం దర్శకత్వంలో రాంచరణ్‌, అరవింద్ స్వామి కాంబినేషన్ రిపీట్

అరవింద్ స్వామి సెకండ్ ఇన్నింగ్స్‌తో  ఫుల్ బిజీగా మారిపోయాడు. ఒక వైపు లీడ్‌రోల్ ప్లే చేస్తూ.. మరో వైపున విలన్ పాత్రలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి చరణ్‌కి విలన్‌గా మారుతున్నట్టు తెలుస్తోంది. 

చరణ్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం అరవింద్ స్వామిని తీసుకున్నట్టు సమాచారం. గతంలో చరణ్ 'ధ్రువ'లో విలన్‌గా అరవింద్ స్వామి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండడం విశేషం. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షూరు కానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com