గల్ఫ్‌ ఫిలిం అవార్డ్స్‌లో మలయాళ సినీ ప్రముఖులు

- March 10, 2017 , by Maagulf
గల్ఫ్‌ ఫిలిం అవార్డ్స్‌లో మలయాళ సినీ ప్రముఖులు

శుక్రవారం సాయంత్రం జరగనున్న గల్ఫ్‌ ఫిలిం అవార్డ్స్‌ కార్యక్రమంలో మలయాళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. మోహన్‌లాల్‌, జయరామ్‌, మంజు వారియర్‌ సహా పలువురు ప్రముఖులు, ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణ కానున్నారు. అబుదాబీలోని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌ ప్రాంగణంలో గల్ఫ్‌ ఫలిం అవార్డ్స్‌ 2016 ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. ఉన్ని మీనన్‌, నడిర్‌ షా, సమాద్‌, అఫ్సల్‌ తదితర సింగర్స్‌ తమ పాటలతో హోరెత్తించనున్నారు. షమ్నా కాసిమ్‌, ఇనియా డాన్స్‌ పెర్ఫామెన్స్‌లు, ఆర్య, ఎడవెల బాబు, రమేష్‌ పిషారాది, ధర్మజన్‌ బోల్గాటి, నవోదయ సాజు తదితరులు కామెడీ స్కిట్స్‌తో ఆహూతుల్ని అలరించనున్నారు. 30 నుంచి 150 దిర్హామ్‌ల ప్రైస్‌తో టిక్కెట్లు లభ్యం కానున్నాయి. 150, 500 దిర్హామ్‌ల ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్‌ ప్రారంభమవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com