నిర్వాసిత అంబులెన్స్ డ్రైవర్ కు జరిమానా విధించిన న్యాయస్థానం

- March 10, 2017 , by Maagulf
నిర్వాసిత అంబులెన్స్ డ్రైవర్ కు  జరిమానా విధించిన న్యాయస్థానం

ఒక కూడలిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక  ప్రవాస అంబులెన్స్ డ్రైవర్ కు  500 ఖతార్ రియళ్లను జరిమానాగా దోహా క్రిమినల్ కోర్ట్ విధించింది. అంబులెన్స్ నే  డీకొట్టి  తీవ్రంగా గాయపడిన మరో వాహనదారుడికి సైతం బీమా సంస్థ సహకారంతో 2,000 ఖతార్ రియళ్లను చెల్లించమని న్యాయస్థానం  ఆదేశించింది. కూడలిలో ఏర్పాటుచేసిన  ట్రాఫిక్ లైట్ ని గమనించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంలో అంబులెన్స్ డ్రైవర్ విఫలమయ్యాడని అలాగే ఇతర మార్గం నుండి కూడలిని దాటుతున్న మరొక వాహనంను ఏ మాత్రం గమనించకుండా దానిని ' ఢీ ' కొట్టాడని పేర్కొంది . అత్యవసర ఫోన్ కాల్ అందుకోవడంతో ఆ ప్రాంతానికి చేరుకొనే తొందరలో ప్రవాస అంబులెన్స్ డ్రైవర్ ఆ తప్పు చేయడం జరిగిందని కోర్టు భావించింది. మరోవైపున అంబులెన్స్ కు మార్గం ఇవ్వకుండా కూడలి దాటడం వలన బాధితుడు ఈ ప్రమాదం జరగడానికి కొంత మేరకు కారణం అని కోర్టు తేల్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com