ఏప్రిల్‌లో సిటీ స్పేస్ అబుదాబీ కాన్ఫరెన్స్
- March 10, 2017
ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్స్, గత ఏడాది 7 శాతం పెరిగినట్లుగా స్టాటిస్టిక్స్ సెంటర్ - అబుదాబీ (ఎస్‌సిఎడి) వెల్లడించింది. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ఆయా రంగాల్లో తీసుకొస్తున్న సంస్కరణలు, అలాగే విదేశీ కంపెనీలను ఆకర్షిస్తున్న విధానంతో దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం వచ్చేందుకు ఉపకరిస్తున్నట్లు ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 18 నుంచి 20 వరకు అబుదాబీ నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగే సిటీ స్పేస్ అబుదాబీ కాన్ఫరెన్స్‌లో మరింతగా ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే అంశాలపై చర్చ జరగనుంది. సిటీ స్పేస్ అబుదాబీ, పెట్టుబడిదారులకు మంచి ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడ్తోంది. ఈ కాన్ఫరెన్స్‌లో అల్దార్ ప్రాపర్టీస్ డైరెక్టర్ మాన్ అల్ అవ్లాకి, మస్దార్ సిటీ ఫ్రీ జోన్ డైరెక్టర్ మొహమ్మద్ అల్ ఫర్దాన్, డుబిజిల్ అండ్ సీన్ మాగీ సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ అన్ బూతెలో తదిరులు ప్రధాన ఆకర్షణ కానున్నారు.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
 - మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
 - విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
 - గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
 - సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 







