ప్రధాని తీవ్ర విచారం జవాన్ల మృతిపై
- March 11, 2017
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టుల దాడిలో 11 మంది సీఆర్‌పీఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అక్కడికి పంపుతున్నట్టు ప్రకటించారు. ''సుకుమా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మరణించడం నన్ను కలచివేసింది. అమరులైన సైనికులకు నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను..'' అని ప్రధాని తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. సుకుమాలో పరిస్థితిని సమీక్షించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరాననీ...
ఆయన బయల్దేరి అక్కడికి వెళుతున్నారని పేర్కొన్నారు. సుకుమా జిల్లాలోని గిరిజనులు ఎక్కువగా ఉండే బస్తర్ ప్రాంతంలో భెజ్జి వద్ద మావోయిస్టులు చుట్టుముట్టి దాడికి తెగబడడంతో 11 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







