సందీప్‌కిషన్ నగరం మూవీ రివ్యూ

- March 11, 2017 , by Maagulf
సందీప్‌కిషన్ నగరం మూవీ రివ్యూ

టాలీవుడ్‌లో సైలెంట్‌గా హిట్ కొడుతూ దూసుకుపోతున్నాడు నటుడు సందీప్‌కిషన్. హీరో నటించిన 'నగరం' శుక్రవారం తెలుగు రాష్ర్టాల్లో విడుదలైంది. నలుగురు యువకుల లైఫ్‌ల గురించి తెరకెక్కించాడు డైరెక్టర్. నగరంలో వీళ్లని ఎలా చూపించాడు అన్నదే అసలు పాయింట్. ఇక సందీప్‌ పక్కన హీరోయిన్‌గా రెజీనా నటిస్తోంది. గతంలో వీళ్లిద్దరు జంటగా నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి. మరి రివ్యూ ఏంటో చూద్దాం..
స్టోరీ.. 
పల్లెటూరు నుంచి ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన నిరుద్యోగి (శ్రీ). పనిపాట లేకుండా తిరిగే సందీప్ కిషన్, రెజీనా లవ్ కోసం తపిస్తాడు. తానున్న ఊళ్లోనే ఉంటూ చిన్నప్పటి నుంచీ ఓ అమ్మాయిని లవ్ చేసే మరో కుర్రాడు.
ఇక ఆపరేషన్‌ కోసం సిటీకి వచ్చి, టాక్సీ నడుపుకొంటూ జీవనం సాగించే మరో వ్యక్తి, డాన్‌ అయిపోవాలని కిడ్నాప్‌ ముఠాతో చేతులు కలిపిన ఓ అమాయక వ్యక్తి. నలుగురి యువకులకు 48 గంటల్లో వివిధ ప్రాంతాల్లో జరిగిన అనుభవాల తుది రూపమే నగరం. సిటీకి వచ్చిన ఈ నలుగురు యువకులు ఏం చేశారు? వాళ్లు ఎంచుకున్న లక్ష్యానికి అందుకున్నారా? ఈ క్రమంలో వాళ్లు చేసిన తప్పులేంటి? ఆయా ఘటనల నుంచి ఎలా బయటపడతారు? అనేది తెరపై చూడాల్సిందే!
విశ్లేషణ.... 
హీరో తరహా స్టోరీ కాకుండా ఈసారి డిఫరెంట్ కథను ఎంచుకున్నాడు హీరో సందీప్ కిషన్. ఈ నటుడికి క్లోజ్‌ఫ్రెండ్ శ్రీ. 
వీళ్లలో ఎవరూ హీరోలు కాదు.. కాకపోతే స్టోరీయే అసలు హీరో. ఫస్ట్ సన్నివేశం నుంచే డైరెక్టర్ నేరుగా స్టోరీలోకి వెళ్లి పోయాడు. ఈ నాలుగు స్టోరీలను ఒకేచోట కలపడంలో ఆసక్తికరమైన అంశాలు రక్తికట్టించాయి. ఇందులో సెట్స్‌, లొకేషన్స్ అంటూ ఏమీ కనబడవు. ఆఖరికి హీరో ఇల్లు కూడా మధ్యతరగతి వ్యక్తి మాదిరిగానే వుంటుంది. ఏ రోల్‌కీ మేకప్‌ పెద్దగా ఉండదు. చేయనితప్పుకి అనవసరంగా డ్రైవర్‌ ఇరుక్కున్నాడని, ఉద్యోగం కోసం వచ్చిన యువకుడి క్యారెక్టర్ ఆకట్టుకునేలా చేశాడు.
డైరెక్టర్. డ్రైవర్‌గా కనిపించిన చార్లీ, రాందాస్‌ అమాయకత్వం బాగుంది. స్టోరీ, సన్నివేశాల్ని జాగ్రత్తగా రాశాడు దర్శకుడు.. ఏ క్యారెక్టర్‌నీ తక్కువ చేయలేకుండా చూపించాడు. ఇక మైనస్‌లూ లేకపోలేదు. స్లో నేరేషన్, క్లైమాక్స్ వీక్‌గా వుంది. కో ఇన్సిడెన్స్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో కాస్త గందరగోళానికి గురి చేశాయి. కిడ్నాపర్స్‌తో చేతులు కలిపిన అమాయకుడి పాత్ర కాస్త రిలీఫ్‌. కొన్ని సన్నివేశాలకు ఎడిటర్ కత్తెరలు వేస్తే బాగుండేది. గతంలో వచ్చిన రెండు సినిమాలు యువ, జర్నీలను కలిపి దీన్ని తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com