ప్రముఖ నిర్మాత దిల్‌రాజు భార్య హాఠాన్మరణం
- March 11, 2017
ప్రముఖ చలనచిత్ర నిర్మాత దిల్ రాజు అలియాస్ వి.వెంకట రమణారెడ్డి భార్య అనిత(46) ఈ సాయంత్రం మృతిచెందారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆమెకు అకస్మాత్తుగా తీవ్ర గుండె నొప్పి రావడంతో ప్రాణాలు విడిచారు. డిస్టిబ్యూటర్ గా.. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా నిర్మాతగా టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన దిల్ రాజు ఇటీవలే కూతురు హన్షిత రెడ్డి వివాహం చేశారు. అయితే, వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'ఫిదా' చిత్రం షూటింగ్ నిమిత్తం దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ వార్త తెలుసుకున్న వెంటనే ఆయన హుటాహుటీన ఇండియాకు పయనమవుతున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







