ఘనంగా హోలీ సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో

- March 11, 2017 , by Maagulf
ఘనంగా హోలీ సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో

ఆ వర్ణాలు మది భావాలకు ప్రతిరూపం. ఆ రంగులు ఎదగానాల అపురూపం. అక్షరాలకు అందని సప్తవర్ణ శోభితం. ఉవ్వెత్తున ఎగసి పడే సంతోష సాగరం. ఒక్కమాటలో చెప్పాలంటే ఆద్యతం కమనీయం... అదే రంగుల పండుగ హోలీ
వసంత రుతువులో ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ రోజున జరుపుకునే పండుగే హోలీ. జీవితాల్లో హరివిల్లులు విరియాలనే కోరికకు ప్రతీకగా హోలీని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. యావత్‌ దేశమంతా కుల,మతం బేధం లేకుండా జరుపుకునే పండుగ హోలీ. హోలీని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. మహా పాల్గుణి, హోలికా, హోలికా దహన్ అనే పేర్లతో పిలుస్తుంటారు. ఎవరెలా పిలిచినా హొలీ విరజిమ్మేది మాత్రం సప్త వర్ణాలనే. హోలీనాడు చిన్నా పెద్దా వయోబేధం లేకుండా అందరు రంగులు పూసుకుంటారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఉత్సాహంగా గడుపుతారు. భారత్ లోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ వంటి తదితర దేశాల్లో ప్రజలు ఆనందంగా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు.జానపద గీతాలతో కృష్ణుడిని ఆరాధిస్తూ రంగుల్లో మునిగి తేలుతారు. పాల్గుణ శుద్ద పూర్ణిమ రోజున కృష్ణ భగవానుడిని ఊయలలో వేసిన వేడుకకు గుర్తుగా బెంగాల్ లో డోలికోత్సవాన్ని జరుపుకుంటారు. మనసులోని భావాలను ప్రతిబింబింప చేస్తూంటాయి కనుక హోలీ నాడు మది కూడా వివిధ దారుల్లో పరవళ్లు తొక్కుతుంది. అవే ఆ భావాలకు తగ్గట్లు పల్లవిస్తు ఉంటాయి. కలకాలం ఉండవులే కన్నీళ్ళు- కలనైనా ఇలనైనా కొన్నాళ్ళు- అంటూ కష్టజీవులు ఆశాభావంతో ముందుకు సాగుతూ ఉంటారు... సంపన్నులకు మాత్రమే కాదు శ్రమజీవులకు సైతం ఆనందాన్ని రెట్టింపు చేసే పండుగ హోలీ..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com