దెయ్యాలు ఉన్నాయని భయపడుతున్న బ్రెజిల్‌ ప్రెసిడెంట్

- March 12, 2017 , by Maagulf
దెయ్యాలు ఉన్నాయని భయపడుతున్న బ్రెజిల్‌ ప్రెసిడెంట్

బ్రెజిల్‌ ప్రెసిడెంట్ మైఖెల్‌ టెమర్‌కు దెయ్యాల భయం పట్టుకుంది. బ్రెజిల్‌ క్యాపిటల్ సిటీ బ్రసీలియాలోని అధికారిక రెసిడెన్స్ అల్వోరాడా ప్యాలెస్‌లో దుష్టశక్తులు ఉండటంతో వేరే ప్యాలెస్‌కి మారిపోయినట్లు టెమర్‌ చెబుతున్నారు. ఈ ప్యాలెస్‌ను బ్రెజిల్‌కి చెందిన శిల్పి ఆస్కార్‌ నీమేయర్‌తో డిజైన్‌ చేయించారు. ఇందులో పెద్ద స్మిమింగ్ ఫుల్ , ఫుట్‌బాల్‌ గ్రౌండ్, ఫార్మా షాప్, చర్చి కూడా ఉన్నాయి. ఈ ప్యాలెస్‌లోకి టెమర్‌ తన భార్య మార్సెలా, కుమారుడు మైఖెల్‌జిన్హోతో కలిసి అడుగుపెట్టినప్పటి నుంచి రాత్రిళ్లు సరిగ్గా పడుకోలేకపోతున్నారట. ప్యాలెస్‌కి ఏదో వాస్తు దోషం ఉందని దెయ్యాలు తిరుగుతున్నట్లు అనిపిస్తోందని టెమర్‌ మీడియా ద్వారా వెల్లడించారు. టెమర్‌ భార్య మార్సెలాకి కూడా ఇలాగే అనిపిస్తుండడంతో వెంటనే ప్యాలెస్‌కి పండితులని పిలిపించి పూజలు కూడా చేయించారు. అప్పటికీ ఎలాంటి ఫలితం కన్పించకపోవడంతో వేంటనే  ప్యాలెస్‌ ఖాళీ చేసి జబురు అనే మరో ప్యాలెస్‌లోకి వెళ్లిపోయినట్టు టెమర్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com