'కంట్రీ క్లబ్' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన హోలీ వేడుకలు

- March 12, 2017 , by Maagulf

హోలీ పండుగకు దుబాయ్ లోని కంట్రీ క్లబ్ వారి 'కంట్రీ క్లబ్ రంగ్ బర్సే 2017' ను బ్లూ బెర్రీ ఈవెంట్స్ మరియు జె పి సంస్థ సంయుక్తంగా నిర్వహించాయి. మార్చి10 వ తేదీ శుక్రవారం 2017 స్థానిక జాబీల్ పార్క్ వద్ద, హోలీ వేడుకను కుటుంబాలతో కలిసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించారు. పంజాబీ సింగర్ అల్ఫాఅజ్ , ప్రసిద్ధ పంజాబీ సింగర్ ఆర్దీ  మరియు రియాలిటీ షో డాన్స్ విజేత సయాలి పరాద్కర్ లు అందించిన సంగీతం మరియు డాన్స్ లతో ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంతో వివిధ రంగులను చల్లుకొంటూ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. బాలీవుడ్ డాన్స్ గ్రూప్ 'డి ఫర్ డాన్స్'  మరియు డిజే పైప్స్ , డిజే మేగాన్, డిజే తన్మయ, డిజే ఇండియాన్స్లప్,  డిజే మయాంక్, డిజే గిగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక శోభను చేకూర్చారు. 105.4 FM  ఆర్.జె. వేద్ మరియు మాజీ మిస్ ఇండియా ప్రేక్షకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకొని ప్రేక్షకుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమములో కంట్రీ క్లబ్  చైర్మన్ రాజీవ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com