అమెరికా హెచ్1బీ వీసాలతో వివాదం
- March 12, 2017
భారత్- అమెరికాల మధ్య వివాదానికి హెచ్1బీ వీసాలే కారణం కావచ్చని ఒక మాజీ అమెరికన్ రాయబారి అభిప్రాయపడ్డారు. లక్షల మంది భారతీయులకు ఉపాధి అయిన ఈ అంశంపై అర్థవంతమైన చర్చజరగాలని అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియా నిషా దేశాయ్ బిస్వాల్ అభిప్రాయపడ్డారు. హెచ్1బీ వీసా నిబంధనలను కఠిన తరం చేస్తూ అమెరికాలో దాదాపు అరడజను బిల్లులు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
హెచ్1బీ వీసా విధానం భారత్ అమెరికాలకు ముఖ్యమైన అంశం అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది ఇరుపక్షాలకు ఉపయోగపడుతుందని అన్నారు. అమెరికా కంపెనీలకు ప్రతిభావంతుల కొదవ ఏర్పడినప్పుడు ఇది ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. కాకపోతే కొంత తప్పుదోవ పట్టిన విషయాన్ని అంగీకరించాల్సిందే. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిపోయి మరింత జఠిలం చేస్తున్నారని అన్నారు. అవసరాలకు తగినట్లు అమెరికన్లను సిద్ధం చేయడం, వారికి శిక్షణ, పనితీరులో మార్పులు ఇతర అంశాలపై దృష్టిపెట్టాల్సి ఉందన్నారు.
ప్రస్తుతం హెచ్1బీ వీసాల్లో మార్పులతో ప్రతిభను స్వాగతించలేకపోవచ్చు.. అయితే ఆర్థిక వ్యవస్థ దూకుడు తగ్గుతుంది అని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







