ఆంక్షలు ఎత్తివేత నగదు విత్‌డ్రాలపై
- March 13, 2017
బ్యాంకులు, ఏటీఎంల వద్ద నగదు ఉపసంహరణపై ఆంక్షలు సోమవారం నుంచి నిలిచిపోనున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) ఫిబ్రవరి 8న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం... ఈ రోజు నుంచి విత్‌డ్రాలపై అన్ని ఆంక్షలు ఎత్తివేస్తారు. గతేడాది నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒక్కసారిగా దేశ ఆర్ధిక వ్యవస్థలో కరెన్సీ కొరత నెలకొంది. దీంతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద కరెన్సీ ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు నగదు ఉపసంహరణపై ఆర్బీఐ పలు పరిమితులు విధించింది. విడతల వారీగా వీటిని ఎత్తివేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 28న సేవింగ్ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ పరిమితిని వారానికి రూ.24 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించింది.
కాగా తాజాగా విత్‌డ్రాపై అన్ని ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ.. నగదు లేక ఏటీఎంలు వెక్కిరిస్తుండడంతో వినియోగదారులకు సాంత్వన దొరికినట్టుకగా కనిపించడం లేదు. హైదరాబాద్ సహా పలు చోట్ల గత కొద్దిరోజులుగా నగదు అందబాటులో లేకపోవడంతో ఖాతా దారులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







