'కాట‌మరాయుడు' ప్రీ రిలీజ్ వేడుక‌ ఈ నెల 18న

- March 13, 2017 , by Maagulf
'కాట‌మరాయుడు' ప్రీ రిలీజ్ వేడుక‌ ఈ నెల 18న

పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’. మిగిలివున్న రెండు పాటల కోసం యూరప్‌కు వెళ్లిన చిత్రబృందం అక్కడ వాటి చిత్రీకరణను పూర్తిచేసింది. దీంతో షూటింగ్‌ మొత్తం పూర్తయింది. మరోపక్క నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఒక పాట తర్వాత మరొక పాటను విడుదల చేస్తున్న చిత్రబృందం ఆదివారం సాయంత్రం మూడోపాటను విడుదలచేసింది. వీటన్నింటికీ విశేషమైన ఆదరణ లభించిందని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ నెల 18న ప్రీ రిలీజ్‌ వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు, సినిమాను ఇదేనెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కిషోర్‌కుమార్‌ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో నార్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన శ్రుతిహాసన్‌ నాయికగా నటిస్తుండగా, ఇతర పాత్రల్లో శివబాలాజీ, కమల్‌ కామరాజు, అజయ్‌, అలీ, నాజర్‌, రావు రమేష్‌, వేణుమాధవ్‌, తరుణ్‌ అరోరా, చైతన్యకృష్ణ, మణికంఠ తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ళ, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com