బంగ్లాదేశీ ఇస్లామిక్‌ బ్యాంకర్లకు ఘన స్వాగతం

- March 14, 2017 , by Maagulf
బంగ్లాదేశీ ఇస్లామిక్‌ బ్యాంకర్లకు ఘన స్వాగతం

కువైట్‌ ఫ్రాన్స్‌ హౌస్‌ - బహ్రెయిన్‌, బంగ్లాదేశ్‌కి చెందిన ఇస్లామిక్‌ బ్యాంక్స్‌ అధికారుల్ని, అలాగే ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ప్రముఖుల్ని ఘనంగా ఆహ్వానించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చ్‌ 2 వరకు ఈ డెలిగేషన్‌ బహ్రెయిన్‌లో పర్యటించింది. యాక్సిమ్‌ ఎక్స్‌ఛేంజ్‌ కంపెనీ డైరెక్టర్‌ సిఇఓ ఎకెఎమ్‌ నూరుల్‌ ఫజుల్‌ బుల్దుల్‌ నేతృత్వంలో ఈ డెలిగేషన్‌ బహ్రెయిన్‌లో పర్యటించడం జరిగింది. కువైట్‌ ఫైనాన్స్‌ హౌస్‌ - బహ్రెయిన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సిఇఓ అబ్దుల్‌హకీమ్‌ అల్‌ఖాయత్‌ సహా పలువురు ప్రముఖులు బంగ్లాదేశీ డెలిగేషన్‌కి ఘనస్వాగతం పలికారు. మనామాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. బ్యాంకింగ్‌ ఇండస్ట్రీకి సంబంధించి పలు అంశాలపై ఇరువురూ చర్చించారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌, బహ్రెయిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, కింగ్‌డమ్‌లోని పలు ఇస్లామిక్‌ బ్యాంక్‌లు ఈ పర్యటనను ఏర్పాటు చేశాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com