వరల్డ్ కిడ్నీ డే: బదర్ అల్ సమా హాస్పిటల్ స్క్రీనింగ్
- March 14, 2017
రువీలోని బదర్ అల్ సమా హాస్పిటల్, వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మధుమేహం, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నవారికి కిడ్నీ వ్యాధి పరీక్షల్ని నిర్వహించింది. 200 మంది పేషెంట్లకు స్క్రీనింగ్ చేయగా, అందులో 15 శాతం మందిలో కొన్ని కాంప్లికేషన్లు కన్పించగా, వారిని నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వినోద్ చంద్రన్‌కి రిఫర్ చేశారు. నెఫ్రాలజిస్ట్ వారిని పరీక్షించి, అవసరమైన మందుల్ని అందజేశారు. స్క్రీనింగ్ క్యాంప్ కోసం పూర్తిస్థాయిలో ఏర్పాటు జరిగాయి. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కిడ్నీ డిజార్డర్, బ్లడ్ ప్రెజర్ లెవల్ చెకప్, బాడీ మాస్ ఇండెక్స్ వంటివి ఇక్కడ పరీక్షించబడ్డాయి. ఆరోగ్యకరమైన సమాజం కోసం అల్ సమా ఆసుపత్రి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. ప్రతి సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా, కిడ్నీ ఆరోగ్యం పట్ల అవగాహనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో తమవంతుగా భాగం పంచుకోవడం ఆనందంగా ఉందని అల్ సమా ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. శరీరంలో కిడ్నీ అనేది అతి కీలకమైన భాగమనీ, ఏమాత్రం కిడ్నీ ఆరోగ్యంపై అశ్రద్ధ వహించరాదని నిపుణులు సూచించారు.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్‌లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







