మారిన ఫేస్ బుక్ రూల్స్
- March 14, 2017
ఫేస్ బుక్ తన నిబంధనలను కఠినతరం చేసింది. ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ లలో ఉన్న సమాచారాన్ని సేకరించి, దాని ఆధారంగా నిఘా పెట్టడానికి సంస్థలకు వీలు లేకుండా నిషేధించింది. సోషల్ మీడియా మానిటరింగ్ కంపెనీలు తాము సేకరించిన సమాచారాన్ని చట్ట సంస్థలకు అమ్ముకొంటున్నాయని వాటి ద్వారా వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని ఇటీవల గుర్తించారు. ప్రధానంగా కొన్ని దేశాల్లో వర్ణవివక్షతో కూడ ఇలా కొంత మందిని టార్గెట్ చేస్తున్నట్టు తెలిపింది. తమ అభిప్రాయాలను స్వేచ్చగా చెప్పేందుకుగాను ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించుకొనేవాళ్ళకు ఈ సోషల్ మీడియా నిఘా అనేది పెనుముప్పుగా పరిణమించింది.
కొన్ని చట్ట సంస్థలు కూడ ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని వ్యక్తుల మీద కేసులు పెడుతున్నాయని ఏసిఎల్ యూ తరపు న్యాయవాది మాల్ కాగిల్ తెలిపారు. అయితే ఇప్పుడు ఇలా ఫేస్ బుక్ ద్వారా సమాచారాన్ని నిఘా అవసరాల కోసం వాడుకోవడాన్ని పూర్తి నిషేధించినట్టు ఆ సంస్థ వివరించింది. అయితే నిఘా అంటే ఏంటన్న విషయాన్ని మాత్రం పూర్తిగా వివరించలేదు.ఫేస్ బుక్ పోస్టింగులను మానిటర్ చేసేందుకు కొన్ని రకాల టూల్స్ ఉంటాయి. వీటిని ఉపయోగించి ఎవరెవరు ఎలాంటి పోస్టింగ్ లు చేస్తున్నారో పరిశీలించవచ్చు. అమెరికాలాంటి దేశాల్లో నిఘా సంస్థలు ఈ టూల్స్ విస్తృతంగా వాడుతున్నాయి. ఇందుకోసం 2010 నుండి ఇప్పటివరకు రూ.40 కోట్లు వెచ్చించాయి. అయితే తాము పోస్టు చేస్తున్న సమాచారమే తమకు ఇబ్బంది కల్గిస్తోందన్న విషయం చాలా మందికి తెలియదు. దాంతో ఇప్పుడు సామాన్య ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకుగాను ఫేస్ బుక్ తన పాలసీని పూర్తిగా మార్చింది.అందులోని సమాచారాన్ని నిఘా అవసరాల కోసం ఉపయోగించకుండా నిబంధనలను విధించింది. తన ప్లాట్ ఫాం ను నిఘా కోసం ఉపయోగించే టూల్స్ ను తయారు చేసే డెవలపర్ పై తాము ఇప్పటికే చర్యలు తీసుకొంటున్నట్టు పేస్ బుక్ తెలిపింది.
తాజా వార్తలు
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్
- బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు..
- సౌదీ బస్సు ప్రమాదం పై సీఎం చంద్రబాబు,సీఎం పవన్, జగన్
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్







