పవన్ ఇకపై ప్రొఫెషనల్‌గా..

- March 15, 2017 , by Maagulf
పవన్ ఇకపై ప్రొఫెషనల్‌గా..

పవన్‌కల్యాణ్- త్రివిక్రమ్ న్యూప్రాజెక్ట్ గురించి ఓవిషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో పవన్ ఐటీ ఎనలిస్ట్‌గా కనిపిస్తాడని 
టాక్. రాయలసీమ నుంచి హైదరాబాద్‌కి వచ్చి ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాయిన్‌ కానున్నారట. ఇందుకోసం త్రివిక్రమ్.. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్‌తో కలిసి రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ సెట్ రెడీ చేయిస్తున్నట్లు సమాచారం.

ఇందులో పక్కా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా పవన్ కనిపించనున్నాడని ఇన్‌సైడ్ సమాచారం. అంతా ఓకేఅయితే ఏప్రిల్‌ ఫస్ట్ వీక్‌ నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడం ఖాయంగా చెబుతున్నారు. ప్రస్తుతం కాటమరాయుడులో కాస్త మీసం పెంచి రూరల్ స్టయిల్‌లో అలరించడానికి రెడీ అయిపోయాడు పవర్ స్టార్!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com