ఫర్నిచర్ ధ్వంసం సెట్స్‌పై బాంబులతో దాడి
- March 15, 2017
పద్మావతి ఫిల్మ్ ఏ ముహూర్తాన షూటింగ్ మొదలుపెట్టారో తెలీదుగానీ ఏదోరూపంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జైపూర్ ఘటన మరువకముందే కొల్హాపూర్‌లో సెట్స్‌ని తగలబెట్టారు గుర్తు తెలియని దుండగులు. దీపికా ప్రధాన పాత్రలో సంజయ్ లీలాబన్సాలీ న్యూప్రాజెక్ట్ పద్మావతి.
ప్రస్తుతం షూటింగ్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరుగుతోంది. ఐతే, మంగళవారం రాత్రి 10.30 గంటలకు ఆ ప్రాంతానికి 40 మందికి పైగా దుండగులు వచ్చి సెట్స్‌పై పెట్రోల్ బాంబులు విసిరి, రాళ్లతో దాడి చేశారు. షూటింగ్ కోసం తీసుకొచ్చిన హార్స్ ఈ ఘటనలో గాయపడింది.
దీనిపై యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇంతకీ దుండగులు ఎవరు? ఎందుకు ధ్వంసం చేశారు అనేది తెలియరాలేదు. కొద్దిరోజుల కిందట జైపూర్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కొన్నివర్గాలను కించపరిచే విధంగా చిత్రీకరిస్తున్నారంటూ డైరెక్టర్‌పై దాడి దిగారు. ఈ ఘటన నుంచి డైరెక్టర్ సంజయ్‌లీలా సురక్షితంగా బయటపడిన విషయం తెల్సిందే!
అప్పటినుంచి ఔట్ డోర్లో షూటింగ్ సమయంలో భద్రతను కట్టుదిట్టం చేసింది యూనిట్. అయినప్పటికీ దాదాపు 40 మంది దుండగులు దాడి చేయడంతో భద్రతా సిబ్బంది వాళ్లని అదుపు చేయలేకపోయారు. కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్‌లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









