ఆంధ్రప్రదేశ్‌ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం

- March 15, 2017 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్ట బద్ధత కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధులు ఇవ్వడంతో పాటు, పర్యావరణ అనుమతుల విషయంలో కూడా కేంద్రమే చొరవ తీసుకుంటుందని పేర్కొంది. ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
బుధవారం సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మూడో టేబుల్‌ అంశంగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశం చర్చకు వచ్చింది. దీనికి మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా గతేడాది సెప్టెంబర్‌ 8న కేంద్ర ఆర్థికమంత్రి ఆరుణ్‌జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఐఐఐటీ బిల్లుకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా 2శాతం డీఏ చెల్లింపునకు కేంద్రమంత్రివర్గం ఓకే చెప్పింది. జనవరి 2017 నుంచి అదనపు డీఏ వర్తించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com