త్వరలో లక్షా 22 వేల కోట్ల పెట్టుబడులు ఏపీలో
- March 15, 2017
పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,22,442 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. టీడీపీ ఎంపీ టీజీ.వెంకటేశ్ బుధవారం రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టడానికి తమ శాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థల దగ్గర అనేక ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) రూ. 2659.90 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టులు చేపట్టనుందని పేర్కొన్నారు. రూ.1095 కోట్లతో పారాదీప్ -హైదరాబాద్ పైప్‌లైన్, రూ.247 కోట్లతో రాజే అండ్ రీబిల్డ్ ఆఫ్ వైజాగ్ టర్మినల్, రూ.342 కోట్లతో పారాదీప్ -హైదరాబాద్ పైప్‌లైన్‌పై విజయవాడ దగ్గర టీఓపీ ఏర్పాటు, రూ.300 కోట్లతో గుంతకల్‌లో పెట్రోలియం, అయిల్, లూబ్రికెంట్ డిపో నిర్మాణం, రూ.650 కోట్లతో కృష్ణపట్నంలో ల్యూబ్ కాంప్లెక్స్ ఏర్పాటు, రూ.25.9 కోట్లతో విజయవాడ సమీపంలోని కొండపల్లిలో ఆయిల్ అదనపు నిల్వల ప్రాజెక్టులు చేపట్టడానికి ఐఓసీఎల్ దగ్గర ప్రణాళికలు ఉన్నాయని వివరించారు.
రూ.39,145 కోట్ల అంచనా వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు డీటెయిల్డ్ ఫీజిబిలిటీ రిపోర్టు (డీఎఫ్ ఆర్) తయారు చేశామని వెల్లడించారు. రాష్ట్ర విభజన చట్టంలో హామీ మేరకు రూ.855 కోట్లతో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) విద్యాసంస్థను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. కేజీ బేసిన్‌లో చమురు, సహజవాయువు రంగంలో 2016 మార్చి వరకు రూ.980 కోట్లు, 2016-17లో రూ.403 కోట్లను ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) పెట్టుబడులు పెట్టిందని.. 2017-18లో రూ.483 కోట్లు పెట్టుబడులు పెట్టనుందని పేర్కొన్నారు.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) సంస్థ రాజమండ్రి పరిధిలో మొత్తం రూ.9649.73 కోట్ల పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. అందులో రూ.5140 కోట్లతో నాగాయలంక ఫీల్డ్ అభివృద్ధి, రూ.450 కోట్లతో మల్లేశ్వరం ఫీల్డ్ అభివృద్ధి పనులు ఉన్నాయని తెలిపారు. ఆఫ్‌షోర్ కేజీ బేసిన్‌లో ఈ సంస్థ మరో 68268.49 కోట్ల పెట్టుబడులు పెట్టిందని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







