'వెళ్లిపోమాకే' వాయిదా దిల్ రాజు భార్య మరణంతో

- March 15, 2017 , by Maagulf
'వెళ్లిపోమాకే' వాయిదా దిల్ రాజు భార్య మరణంతో

దిల్ రాజు సినిమా లను అంచనా వెయ్యడం లో దిట్ట అనే సంగతి విధితమే.. దిల్ రాజు టాలెంట్ ను వెదికి పట్టుకొని చేసే సినిమాలు ఇప్పటి వరకూ ఫెయిల్ అయినవి తక్కువనే చెప్పవచ్చు.. కాగా తాజాగా దిల్ రాజు మ‌హ్మ‌ద్ యాకూబ్ అలీ అనే కొత్త ద‌ర్శ‌కుడు రూపొందించిన ఓ చిన్న సినిమా న‌చ్చేసి.. దాన్ని త‌న బేన‌ర్లో రిలీజ్ చేయ‌డానికి ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. వేరే టైటిల్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి 'వెళ్లిపోమాకే' అనే టైటిల్ పెట్టింది కూడా దిల్ రాజే. నాలుగు నెల‌ల కింద‌టే రెడీ అయిన ఈ చిత్రాన్ని మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేద్దామ‌ని దిల్ రాజే ఆపారు.. కాగా ఈ నెల 10న రిలీజ్ చేద్దామని ముందుగా భావించారు.. కానీ ఆరోజు రిలేజ్ అయ్యే సినిమాలు ఎక్కువగా ఉండడంతో మళ్ళీ మార్చి 17 కు వాయిదా వేశారు. కానీ ఈ సారి కూడా ఈ సినిమా వాయిదా పడ్డది. దిల్ రాజు భార్య హఠాత్తుగా మృతి చెందడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com