గోపీచంద్ కొత్త యాంగిల్
- March 15, 2017
సెటైరికల్ హీరోయిజం చూపించడంలో గోపీచంద్ స్టైల్ సెపరేట్. ఇదే తరహా యాక్షన్ తో ప్రేక్షకులకు దగ్గరైన గోపీచంద్, ఇప్పుడు తనలోని మరో యాంగిల్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. సంపత్ నంది డైరెక్షన్లో గోపీచంద్, గౌతమ్ నందగా రాబోతున్నాడు. ఈ మూవీలో గోపిచంద్ లోని స్టైలిష్ యాంగిల్ ను పరిచయం చేస్తూ డైరెక్టర్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.
ఈ మూవీ టాకీ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తవగా, ప్రస్తుతం మూవీ యూనిట్ సాంగ్స్ షూట్ కోసం దుబాయ్ వెళ్లబోతోంది. అక్కడ బూర్జ్ ఖలీఫా ప్రాంతంలోనే ఎక్కువ శాతం షూటింగ్ జరపాలని నిర్ణయించారు. దీనికి పర్మిషన్ కోసం దరఖాస్తు చేశారుకూడా. దుబాయ్ షెడ్యూల్ లో రాజు సుందరం కొరియోగ్రఫిలో గోపిచంద్ ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు మరో పాటను షూట్ చేయాలని భావిస్తున్నారు.
తిరిగివచ్చిన తర్వాత హైదరాబాద్ లో మిగిలిన పాటలను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. తమన్ సంగీతం. శ్రీ బాలాజీ సినీ మీడియా నిర్మాణం. మే నెలలో గౌతమ్ నంద రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







