బీజేపీ అభ్యర్థిగా నటి గౌతమి ఆర్కేనగర్‌ రేసులో

- March 16, 2017 , by Maagulf
బీజేపీ అభ్యర్థిగా నటి గౌతమి ఆర్కేనగర్‌ రేసులో

ఆర్కేనగర్‌ బైపోల్‌లో బీజేపీ అభ్యర్థిగా నటి గౌతమిని రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించి 
తెరవెనుక పనులు చకచకా జరిగిపోతున్నాయి. అధికార అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ డిప్యూటీ కార్యదర్శి దినకరన్‌ పోటీ 
చేస్తుండగా, అటు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ కూడా తన అదృష్టాన్ని పరీక్షించు కోనుంది. డీఎంకే తన అభ్యర్థిని ప్రకటించింది. పన్నీర్ వర్గం నుంచి మధుసూదనన్ పేర్లు దాదాపు ఖరారైంది. ఎలాగలేదన్నా అక్కడ చతుర్ముఖి పోటీ నెలకొనడం ఖాయం.
మరోవైపు జయ మృతిపై అనుమానాలను తొలగించాలంటే న్యాయవిచారణకు ఆదేశించాలని గౌతమి డిమాండ్ చేసిన 
విషయం తెల్సిందే! ఈ విషయంలో ఆమె ప్రధానిని కలిశారు! ఈ నేపథ్యంలో ఆమెని బరిలో దింపాలని బీజేపీ నేతలు 
భావిస్తున్నట్లు సమాచారం.
ఉత్తరాదిన సాధించిన ఫలితాల ప్రభావం తమిళనాడుపై పడుతుందని, దీనికితోడు సినీ గ్లామర్ కూడా కొంతమేరా పనిచేస్తుందని భావిస్తున్నారు. ఇదిలావుండగా గౌతమి ఎన్నికల్లో పోటీ చేయలేదంటూ ఆమె ప్రతినిధి చెప్పినట్టు ఓ ఇంగ్లీష్ డైలీ రాసుకొచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఆమె, తనకు ప్రతినిధి ఎవరూ లేరని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. ఈ లెక్కన గౌతమి ఎన్నికల బరిలోకి దిగడం ఖాయంగానే కనిపిస్తోంది.
అన్నట్లు గతంలో బీజేపీ తరపున ఆమె పనిచేసింది కూడా!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com